వకీల్ సాబ్ పై చిరంజీవి రివ్యూ

ఓ సినిమాకు రివ్యూ ఎవరైనా ఇస్తారు. చాలా సైట్స్ ఆ పని చేస్తున్నాయి కూడా. కానీ ఓ సినిమాకు
స్వయంగా చిరంజీవి రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది. వకీల్ సాబ్ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాను
ప్రత్యేకంగా మెచ్చుకున్న చిరంజీవి.. మూవీకి సంబంధించి చాలా పాయింట్లను డిస్కస్ చేశారు.

“మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం. నివేద థామస్, అంజలీ, అనన్య వారి పాత్రల్లో జీవించారు. థమన్, డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీ కపూర్ .. దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నిటికి మించి ఇది మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు!”

ఇలా వకీల్ సాబ్ పై తనదైన స్టయిల్ లో విశ్లేషణ ఇచ్చారు చిరంజీవి. తల్లి అంజనా దేవితో కలిసి ఈ
సినిమాను చూశారు చిరంజీవి. చిరుతో పాటు వరుణ్ తేజ్, సాయితేజ్, నాగబాబు కూడా సినిమా చూడ్డానికి
వెళ్లారు. అలా మొదటి రోజు సినిమా చూసిన తర్వాత, ఈ రోజు తన రివ్యూను పోస్ట్ చేశారు చిరంజీవి.
అంతేకాదు.. దర్శకుడు వేణుశ్రీరామ్, నిర్మాత దిల్ రాజును తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా
అభినందించారు