రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో

రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. సినిమాలో ఓ
కీలకమైన పాత్ర ఉందని, దాన్ని ఓ స్టార్ హీరోతో చేయించడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం
చాన్నాళ్లుగా నడుస్తోంది. ఆ రోల్ కి ముందుగా కేజీఎఫ్ స్టార్ యష్ పేరు వినిపించింది. ఆ తర్వాత పవన్
కళ్యాణ్ , చిరంజీవి ఇలా ఒక్కొక్కరి పేరు చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఫైనల్ గా ఆ కీలక పాత్ర
చేయబోతుంది సల్మాన్ ఖాన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. సినిమాలో సల్మాన్ ఓ పవర్ ఫుల్
పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని అంటున్నారు.

ఉన్నఫలంగా ఇలా సల్మాన్ పేరు తెరపైకి రావడం వెనక ఓ లాజిక్ ఉంది. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ బెస్ట్
ఫ్రెండ్స్. గతంలో చరణ్, ఓ హిందీ సినిమాలో నటిస్తే, దానికి ఫుల్ గా ప్రచారం చేసిపెట్టాడు సల్మాన్. ఆ
తర్వాత సల్మాన్ నటించిన ఓ హిందీ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు రామ్ చరణ్. ఇలా ఇద్దరి
మధ్య మంచి బాండింగ్ ఉంది.

అదే అనుబంధంలో చరణ్ తో చేయబోయే సినిమాలో సల్మాన్ ను తీసుకోవాలని శంకర్
అనుకుంటున్నాడట. అదే కనుక జరిగితే ఈ సినిమా సిసలైన పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇటు
టాలీవుడ్ స్టార్, అటు బాలీవుడ్ సూపర్ స్టార్ కలిసి ఓ సినిమా చేస్తే అంతకంటే పాన్ ఇండియా అప్పీల్
ఇంకేముంటుంది. అయితే ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే.