ఆర్ఆర్ఆర్ పుకార్లపై క్లారిటీ

ఆర్ఆర్ఆర్ పై ఎప్పటికప్పుడు పుకార్లు రావడం, వాటిపై యూనిట్ క్లారిటీ ఇవ్వడం నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో పుకారు వచ్చింది. ఆ వెంటనే యూనిట్ నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. ఇంతకీ ఆ రూమర్ ఏంటో చూద్దాం.

కరోనా సెకెండ్ వేవ్ వల్ల సినిమాలన్నీ వరుసగా వాయిదాపడుతున్నాయి. లవ్ స్టోరీ, నారప్ప, విరాటపర్వం, ఆచార్య లాంటి సినిమాలన్నీ వాయిదాల బాట పడుతున్న నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ కూడా పోస్ట్ పోన్ అయిందంటూ ప్రచారం ఊపందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడేలా ఉందనేది ఆ కథనాల సారాంశం.

ఊహాగానాలు వచ్చిన వెంటనే యూనిట్ అప్రమత్తమైంది. పుకార్లు ఖండించింది. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడడం లేదని, ప్రస్తుతానికైతే అక్టోబర్ 13 తేదీకే కట్టుబడి ఉన్నామని యూనిట్ ప్రకటించింది. సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల షూటింగ్ నిలిచిపోయిందనే రూమర్ ను కూడా యూనిట్ కొట్టేసింది. ప్రస్తుతం షూటింగ్ నడుస్తోందని.. మరో 2 నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని కూడా క్లారిటీ ఇచ్చింది.