సీఎం కేసీఆర్​కు కరోనా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు డాక్టర్లు ధ్రువీకరించారు. గత రెండు మూడురోజులుగా కేసీఆర్​కు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. యాంటిజెన్​ టెస్ట్​లో సీఎం కేసీఆర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

అయితే ఆర్​పీఆర్​ శాంపిల్​ సేకరించారు. అందుకు సంబంధించిన ఫలితం రావాల్సి ఉన్నది. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్​ ఓ ప్రకటన విడుదల చేశారు.‘సీఎం కేసీఆర్​కు స్వల్ప లక్షణాలతో కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఫామ్​ హౌస్​లో వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.’ అని సోమేశ్​ కుమార్​ పేర్కొన్నారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్​ ఆరోగ్యంగానే ఉన్నట్టు సమాచారం. ఒకవేళ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే .. ఆయనను యశోద ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇటీవల ఆయనను కలిసిన వాళ్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రగతిభవన్​ వర్గాలు సూచించాయి.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్​ వెంటనే కోలుకోవాలంటూ పలువురు ట్వీట్లు పెడుతున్నారు. సీఎం కేసీఆర్​ తొందరగా కోలుకోవాలంటూ టీఆర్​ఎస్​ కార్యకర్తలు, కేసీఆర్​ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్​ వెంటనే కోలుకోవాలంటూ సోషల్​మీడియాలోనూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పలువురు సెలబ్రిటీలు సైతం సీఎం కేసీఆర్​ వెంటనే కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.