రేపట్నుంచి థియేటర్లు బంద్

కరోనా కారణంగా తెలంగాణలో మరో కీలక నిర్ణయం వెలువడింది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూకు
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ థియేటర్లపై కూడా పడింది. రేపట్నుంచి
తెలంగాణలోని అన్ని థియేటర్లు మూసివేస్తున్నట్టు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రకటించింది.

అయితే ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తో సినిమా థియేటర్ల యాజమాన్య సంఘం విభేదించింది. కరోనా వల్ల
థియేటర్లు మూసివేయడం లేదని… సినిమాల్లేక, ఉన్న సినిమాలకు ఆక్యుపెన్సీ లేక థియేటర్లు
మూసేస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఎవరైనా తమ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే థియేటర్లు
తెరవడానికి, ప్రభుత్వ నిబంధనల మేరకు సినిమాను ఆడించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని
తెలిపింది.

అయితే అలా చెప్పినా, ఇలా వాదించినా రేపట్నుంచి థియేటర్లు తెరుచుకోవనేది మాత్రం వాస్తవం. ఈ
మొత్తం వ్యవహారంలో వకీల్ సాబ్ కు మాత్రం కాస్త మినహాయింపు ఇచ్చారు. రేపట్నుంచి కొన్ని పరిమిత
థియేటర్లలో తెలంగాణలో వకీల్ సాబ్ చిత్రాన్ని మాత్రం కొనసాగిస్తారు. అది కూడా ఈ వారంతం వరకే.
వచ్చే సోమవారం నుంచి అది కూడా ఉండదు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ 50శాతం అక్యుపెన్సీ
విధిస్తూ జీవో జారీ అయిన సంగతి తెలిసిందే.