కేసీఆర్​ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్​ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయనను ఫామ్​హౌస్​లో ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి పరీక్షల కోసం కేసీఆర్​ను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు.

కేసీఆర్​ను ఆస్పత్రికి తీసుకొచ్చారనగానే అందరిలోనూ టెన్షన్​ నెలకొన్నది. అయితే కేసీఆర్​ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మాత్రమే ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు స్పష్టం చేశారు. పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్​ తిరిగి ఫామ్​ హౌస్​కు వెళ్లిపోయారు. అయితే సోమాజిగూడ యశోదకు వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్​ ఆరోగ్యంగానే కనిపించారు.

ప్రస్తుతం కేసీఆర్​కు కరోనా లక్షణాలు తగ్గిపోయాయని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. కేసీఆర్​కు సీటీ స్కాన్​, ఇతర రక్త పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు నిర్వహించగా ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తేలింది. మరోవైపు ఆక్సిజన్​ స్థాయిలు కూడా బాగానే ఉన్నాయని వైద్యులు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్​ విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

సాగర్​ సభలోనే సీఎం కేసీఆర్​కు కరోనా సోకి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 19న ఆయనకు యాంటీజెన్‌ పరీక్ష చేశారు. ఆ తర్వాత ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేశారు. అప్పుడు కేసీఆర్​కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఎర్రవెళ్లిలోని ఫామ్​హౌస్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లు ఆయన ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.