క్వారంటైన్ లో మహేష్, చరణ్

సెకెండ్ వేవ్ టాలీవుడ్ ను గట్టిగా తాకింది. ఇప్పటికే షూటింగ్స్ అన్నీ రద్దవ్వగా.. ఈసారి స్టార్ హీరోలను
కూడా ఇబ్బంది పెడుతోంది. తాజాగా కరోనా దెబ్బకు మహేష్ బాబు, రామ్ చరణ్ క్వారంటైన్ లోకి
వెళ్లిపోయారు. వీళ్లిద్దరూ ఇలా ఉన్నఫలంగా హోం ఐసొలేషన్ లోకి వెళ్లడానికి కారణం ఉంది.

రామ్ చరణ్ కారవాన్ డ్రైవర్ కు కరోనా సోకింది. అంతేకాదు, ఆయన కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కూడా
కోల్పోయాడు. దీంతో రామ్ చరణ్, ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక మహేష్ బాబు వ్యక్తిగత మేకప్ మేన్
కు కూడా కరోనా సోకింది. దీంతో మహేష్ బాబు కూడా క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు.

ఇద్దరు హీరోలు ఐసొలేషన్ లోకి వెళ్లిపోవడంతో వాళ్లకు సంబంధించిన సినిమాలు ఎక్కడికక్కడ
నిలిచిపోయాయి. మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను ఇదివరకే ఆపేశారు. ఎందుకంటే, ఆ
సెట్స్ లో ఆరుగురికి కరోనా సోకింది. ఇప్పుడు మహేష్ కూడా సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాడు. అటు
రామ్ చరణ్ వల్ల ఆర్ఆర్ఆర్ కు మరోసారి బ్రేకులు పడ్డాయి.