రెండో పెళ్లి చేసుకున్న తమిళ హీరో

తమిళ నటుడు విష్ణు విశాల్ ఈరోజు పెళ్లి చేసుకున్నాడు. అతడు పెళ్లి చేసుకున్నది ఎవర్నో తెలుసా?
ఒకప్పటి బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల. వీళ్లిద్దరి పెళ్లి హైదరాబాద్ లో కొద్దిసేపటి కిందట జరిగింది.

మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు విష్ణువిశాల్, గుత్తా జ్వాల. మొదటి సారి లాక్ డౌన్ పడినప్పుడు తమ
ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. అదే టైమ్ లో రింగులు మార్చుకొని అర్థరాత్రి వేళ నిశ్చితార్థం కూడా
చేసుకున్నారు. ఇప్పుడు రెండోసారి కరోనా విజృంభిస్తున్న వేళ, గుంభనంగా పెళ్లి చేసుకున్నారు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో వీళ్ల పెళ్లి సింపుల్ గా జరిగింది. కరోనా వల్ల ఎక్కువమందిని
ఆహ్వానించలేదు. వీళ్లిద్దరికి చెందిన బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.

ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇంతకుముందు తమిళ నిర్మాత రాగినిని పెళ్లాడి విడాకులిచ్చాడు విష్ణు విశాల్.
ఇటు గుత్తా జ్వాల, తన సహచర క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్లకు
విడాకులిచ్చింది.