క్వారంటైన్‌లో మన హీరోలు

సెకండ్ వేవ్ సినీ పరిశ్రమను కూడా కుదిపేసింది. ఒకపక్క షూటింగ్ లు మరో పక్క సినిమా రిలీజ్ లు రెండూ ఆగిపోయాయి. అదీ చాలదన్నట్టు పలువురు నటులు షూటింగ్ సమయంలో ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మన టాలీవుడ్ హీరోలంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

సర్కారువారి పాట షూటింగ్ టైంలో చిత్ర బృందంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో.. షూటింగ్ ఆగిపోయింది. మహేష్ కు కూడా కరోనా వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు సూపర్ స్టార్ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ప్రభాస్ మేకప్ మ్యాన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రెబల్ స్టార్ కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

ఇకపోతే ఆచార్య షూటింగ్ సమయంలో సోను సూద్ తో పాటు, చిత్ర యూనిట్ లో కూడా కొంతమందికి పాజిటివ్ రావడంతో చిరంజీవి, రామ్ చరణ్ కూడా క్వారటైన్ లోనే ఉంటున్నారు. అలా సెకండ్ వేవ్ కరోనా సినిమా ఇండస్ట్రీని ముప్పతిప్పలు పెడుతుంది.