అఖండ అస్సలు ఆగట్లేదుగా

‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ప్ర‌స్తుతం
తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ‌ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ అంత పాపుల‌ర్ అవ‌డ‌మే కాకుండా
సింహా’, ‘లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్
బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` మీద
ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని మ‌రింత పెంచింది.

ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్‌13న `అఖండ` టీజ‌ర్ విడుద‌లై యూట్యూబ్‌లో అపూర్వ ఆద‌ర‌ణ‌తో
దూసుకెళ్తూ కేవ‌లం 16 రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్
50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌తో పాటు భారీతారాగ‌ణం
న‌టిస్తున్న‌ ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్
ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.