నారప్ప కూడా చెప్పేశాడు

narappa-may-14-release

తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్న
సంగతి తెలిసిందే. ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ సినిమా వచ్చే
నెల 14న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు
మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు.

“నారప్ప’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకి మనవి.. ప్రస్తుతం
ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదలను వాయిదా
వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ సినిమాను మీ
ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్నిస్తున్నాం” అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

దీంతో ‘నారప్ప’ మే నెలలో రిలీజ్ అవుతుందా లేదా అనే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ
ఏడాది వెంకటేష్ నుండి మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. నారప్ప థియేటర్స్ లోకి వచ్చిన
వెంటనే తక్కువ గ్యాప్ లో ‘దృశ్యం 2’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ లో ‘F3’
రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అనుకున్న ప్లానింగ్ మిస్ అవ్వడంతో ఈ ఏడాది వెంకీ నుండి
రెండు సినిమాలు మాత్రమే రానున్నాయని తెలుస్తుంది.