బొమ్మాళి పెళ్లిపై మళ్లీ పుకార్లు

అనుష్క పెళ్లిపై పుకార్లు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు 4 ఏళ్లుగా ఆమె పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ తో లింక్ పెడుతూ ఆమె పెళ్లిపై వచ్చిన కథనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు మరోసారి పెళ్లి పుకార్లతో వార్తల్లోకెక్కింది అనుష్క. ఈసారి దుబాయ్ కు పుకార్లు షిఫ్ట్ అయ్యాయి.

దుబాయ్ కు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త కొడుకుతో అనుష్క పెళ్లి జరగనుందట. కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత పెళ్లిపై ఓ ప్రకటన వస్తుందట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అనుష్కకు కాబోయే భర్త, ఆమె కంటే హైట్ లో చిన్నగా ఉంటాడట. అంతేకాదు.. వయసులో కూడా చిన్న అంటూ కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం అనుష్క తక్కువగా సినిమాలు చేస్తోంది. కేవలం తన మనసుకు నచ్చిన కథలు మాత్రమే సెలక్ట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ గ్యాప్ లో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తోంది.