నితిన్ కొత్త సినిమా ప్రకటిస్తాడా?

హీరో నితిన్ ఇప్పటికే బిజీ. కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి కానీ, ఈపాటికి మరో సినిమా కంప్లీట్
చేసేవాడు. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న ఈ నటుడు… త్వరలోనే పవర్ పేట అనే కొత్త ప్రాజెక్టు
కూడా లాంచ్ చేయబోతున్నాడు. ఈ గ్యాప్ లో నితిన్ పై మరో కొత్త ప్రచారం ఊపందుకుంది.

యాత్ర, పాఠశాల, ఆనందోబ్రహ్మ లాంటి సినిమాలు తెరకెక్కించిన మహి వి రాఘవ్ దర్శకత్వంలో నితిన్ ఓ
సినిమా చేయబోతున్నాడట. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా
ముగిశాయని అంటున్నారు. ప్రాజెక్టు సెట్ అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చే
అవకాశం ఉంది. ఎందుకంటే, నితిన్ వద్ద చాన్నాళ్లుగా యూవీ నిర్మాతల అడ్వాన్స్ ఉంది.

రీసెంట్ గా కొత్త కథలు సెలక్ట్ చేసుకుంటున్నాడు నితిన్. మహి వి రాఘవ్ చెప్పిన కథ కూడా ఇలానే ఓ
కొత్త కాన్సెప్ట్ అంటున్నారు. సినిమాలో హీరోకు ఓ అన్న ఉంటాడు. హీరో, అతడి అన్న ఇద్దరూ పోలీస్
ఆఫీసర్లే. కాకపోతే ఒకరు మంచి ఆఫీసర్, ఇంకొకరు బ్యాడ్ పోలీస్ అన్నమాట. ఇలా కథ సాగుతుందని
తెలుస్తోంది.