సాయితేజ్ ప్రత్యేక విన్నపం

మీకు ఇండస్ట్రీతో లింక్ ఉందా? కొంతమంది ప్రముఖులు మీకు పరిచయమా? అయితే మీకు సాయిధరమ్
తేజ్ ఫోన్ చేస్తాడు. అర్జెంట్ గా అవసరం ఉంది కొంత డబ్బు కావాలని అడుగుతాడు. స్వయంగా హీరో ఫోన్
చేసి డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాం అంటారా? ఇలాంటి సందర్భాల్లోనే వివేకం-విచక్షణ
అవసరం. సాయిధరమ్ తేజ్ మనకు ఎందుకు ఫోన్ చేస్తాడు? చేసినా డబ్బులు ఎందుకు అడుగుతాడు?
ఈ సింపుల్ లాజిక్ ను మనసులో పెట్టుకుంటే మోసపోకుండా ఉంటాం.

అవును.. ఓ అగంతకుడు తననుతాను సాయిధరమ్ తేజ్ గా పరిచయం చేసుకుంటున్నాడు. అర్జెంట్ గా
డబ్బులు కావాలని అడుగుతున్నాడు. ఇప్పటికే పరిశ్రమలో కొందరికీ ఈ ఫోన్లు వెళ్లాయి. ఎంత మంది బుక్
అయ్యారో తెలీదు. సాయితేజ్ మాత్రం వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

“నా పేరు వాడుకొని, ఓ వ్యక్తి నాకు తెలిసిన కొంతమందికి ఫోన్ చేస్తున్నాడు. నాతో కలిసి నటించిన
వాళ్లకు, ఇండస్ట్రీలో ఇతరులకు ఫోన్లు చేసి ఆర్థిక సాయం కోరుతున్నాడు. దీనికి సంబంధించి
చట్టపరమైన చర్యలకు సిద్ధమౌతున్నాను. నా పేరు చెప్పి డబ్బులు అడుగుతున్న అలాంటి వ్యక్తుల పట్ల
జాగ్రత్తగా ఉండండి.”