వరుణ్ సందేశ్ రీఎంట్రీ ఇదే

చాన్నాళ్లుగా తెరపై కనిపించలేదు వరుణ్ సందేశ్. వరుసగా ఫ్లాపులు రావడంతో మార్కెట్ పడిపోయింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆ మధ్య అమెరికా కూడా వెళ్లిపోయాడు ఈ హీరో. ఎట్టకేలకు వరుణ్ సందేశ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. సైలెంట్ గా ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.

‘ఇందువదన‘ అనే టైటిల్ తో పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. క్యారెక్టర్ కి తగ్గట్టే కంప్లీట్ లుక్ మార్చాడు. ఆ లుక్ ని ఫస్ట్ లుక్ గా 2-3 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో లాంగ్ హెయిర్, మీసకట్టుతో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు వరుణ్ సందేశ్.

ఇటివలే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెడ్యుల్ పూర్తిచేసుకొచ్చారు. వరుణ్ సందేశ్ పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ధన్ రాజ్ , మహేష్ విట్ట, సురేఖ వాణి, జ్యోతి సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బేనర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎస్.ఆర్ దర్శకుడు.