తండ్రిని కోల్పోయిన యాంకర్ ప్రదీప్

నటుడు, యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు
మరణించారు. కొన్నాళ్లుగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స
చేయించుకుంటున్నారు. కానీ పాండురంగను వైద్యులు కాపాడలేకపోయారు. ఆయన వయసు 65
సంవత్సరాలు.

టాలీవుడ్ లో, బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రదీప్. యాంకరింగ్ లో
తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. యాంకరింగ్ లో స్పాట్ లో జోకులు పేల్చడం ప్రదీప్ స్టయిల్.
కెరీర్ ను మలుచుకోవడంలో తన తండ్రి ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని చెప్పే ప్రదీప్.. ఇప్పుడు ఆ తండ్రినే కోల్పోయాడు.

నిజానికి కొన్ని రోజుల కిందట ప్రదీప్ కు కరోనా సోకిందంటూ పుకార్లు వచ్చాయి. అప్పట్లో వాటిని ప్రదీప్
ఖండించలేదు. రెగ్యూలర్ గా షూటింగ్స్ కు హాజరవుతూ, తన చేతల ద్వారా పుకార్లను ఖండించాడు. కానీ
ఊహించని విధంగా ఆయన తండ్రి కరోనా కాటుకు బలయ్యారు.