పుకార్లపై స్పందించిన ఇలియానా

ఇలియానాపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. అవి కూడా అలాంటిలాంటి పుకార్లు కావు. మచ్చుకు కొన్ని
చెప్పుకుందాం. ఫారిన్ ఫొటోగ్రాఫర్ వల్ల ఇలియానా గర్భవతి అయిందనేది అందులో ఒకటి. ఇక మరో
పుకారులో, ఇలియానా ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, సకాలంలో పని మనిషి వచ్చి ఆ
ప్రయత్నాన్ని ఆపిందనేది దాని సారాంశం. ఇలా తనపై ఎప్పటికప్పుడు వస్తున్న పుకార్లపై ఒకేసారి
స్పందించింది ఈ గోవా బ్యూటీ.

తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదంటోంది ఇలియానా. మరీ ముఖ్యంగా తన ఇంట్లో పని
మనిషి ఉండదని, ఎవరి పని వాళ్లు చేసుకుంటామని చెప్పుకొచ్చింది. ఇక గర్భం దాల్చిందనే పుకార్లపై
స్పందిస్తూ.. తనకు ఇప్పటివరకు 3 సార్లు గర్భం వచ్చినట్టు మీడియా వాళ్లు సృష్టించారని నవ్వుతూ
చెప్పింది.

మరోసారి హిందీలో బిజీ అయింది ఈ బ్యూటీ. అజయ్ దేవగన్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది.
దీంతో పాటు మరో 2 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. తెలుగు సినిమాల్లో మాత్రం ఆమె ఇక
నటించకపోవచ్చు.