ఓటీటీ బిజినెస్ లోకి నాగార్జున

కొత్త వ్యాపారం ఏది కనిపించినా అందులో ఓ వేలు పెట్టడం నాగార్జునకు అలవాటు. ఇప్పటికే అలా చాలా
వ్యాపారాలు ట్రై చేశారు ఈ సీనియర్ హీరో. ఇప్పుడీ అక్కినేని హీరోకు ఓటీటీ బాగా నచ్చిందట. కుదిరితే
ఓటీటీ బిజినెస్ లోకి ఎంటరవ్వాలని అనుకుంటున్నారట నాగార్జున. ఈ మేరకు ఓ ప్రాజెక్టు రిపోర్ట్
నాగార్జునకు చేరినట్టు చెబుతున్నారు.

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఇప్పటికే ఓ ఓటీటీని కలిగి ఉన్నారు. పూర్తిగా
కాకపోయినా ఆహా యాప్ కు ముఖచిత్రంగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. అంతేకాదు.. తెలుగు
ఓటీటీ పితామహుడిగా తనకుతాను ప్రచారం కల్పించుకుంటున్నారు.

ఈ సంగతి పక్కనపెడితే.. ఓటీటీ బిజినెస్ కు బాగా స్కోప్ ఉందని నాగార్జున గ్రహించారు. అందుకే తను
కూడా ఓటీటీ వేదికను పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ పెట్టడం
ఒక్కరి వల్ల కాదు. వందల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ప్రతి ఏటా బడ్జెట్ కేటాయిస్తుండాలి.
అందుకే నాగార్జునతో పాటు మరో ముగ్గురు కలిసి ఈ ఓటీటీని స్థాపిస్తారట. ఆహా టైపులోనే ఇది కూడా
పూర్తిస్థాయి తెలుగు ఓటీటీగా రాబోతోందని సమాచారం.