పవన్ సరసన హీరోయిన్ ఫిక్స్?

ప్రస్తుతం రానాతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. మలయాళంలో పెద్ద హిట్టయిన
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేయకుండానే
షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ సరసన హీరోయిన్ ఎవరనేది డిసైడ్ చేయకుండానే
సెట్స్ పైకి వచ్చేసింది. ఇప్పుడా లాంఛనం పూర్తయ్యేలా ఉంది.

సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. దీనికి
సంబంధించి ఆల్రెడీ చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందుగా పవన్ సరసన
సాయిపల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. రీమేక్ సినిమాల్లో నటించనని సాయిపల్లవి తెగేసి చెప్పేసింది.
పవన్ కల్యాణ్ సినిమా అయినప్పటికీ చేయనని తేల్చిచెప్పింది. దీంతో ఆమె స్థానంలో నిత్యామీనన్ ను
తీసుకున్నట్టు టాక్.

ఈ సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్ ను లాక్ చేశారు. సినిమాలో రానా సరసన హీరోయిన్ గా ఐశ్వర్య
రాజేష్ ను తీసుకున్నారు. ఇప్పుడు నిత్యామీనన్ కూడా ఫిక్స్ అయితే సినిమా షూటింగ్ వేగం
పుంజుకుంటుంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్న
సంగతి తెలిసిందే.