విశ్వక్ అసలు పేరు తెలుసా?

హీరో విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. మరి హీరో దినేష్ నాయుడు గురించి తెలుసా? ఈయన కూడా టాలీవుడ్ లో ఉన్నాడు. హీరోగా సినిమాలు కూడా చేశాడు. ఇప్పటివరకు ఈ పేరు వినలేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

హీరో విశ్వక్ సేన్ అసలు పేరే ఈ దినేష్ నాయుడు. పక్కా తెలుగు పేరు. తెలుగు వ్యక్తి. అంతా తనను నార్త్ ఇండియన్ అనుకుంటారని, కానీ తను పక్కా తెలుగని స్పష్టంచేస్తున్నాడు విశ్వక్. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో పుట్టిన ఈ హీరోకు తల్లిదండ్రులు దినేష్ నాయుడు అనే పేరు పెట్టుకున్నారు.

అయితే న్యూమరాలజీ ప్రకారం ఆ పేరు పెట్టుకుంటే పెద్దగా కలిసిరాదనేది విశ్వక్ తండ్రి అభిప్రాయం. అందుకే ఆయన సూచన మేరకు తన పేరును విశ్వక్ సేన్ గా పెట్టుకున్నాడు. ఈ పేరు సూచించింది కూడా విశ్వక్ తండ్రే కావడం విశేషం. అలా దినేష్ నాయుడు కాస్తా విశ్వక్ సేన్ అయిపోయాడు.