మరో సినిమా కూడా వాయిదా

ఇప్పుడంతా వాయిదాల పర్వం నడుస్తోంది. తమ సినిమా వాయిదా పడిందంటూ రోజుకో యూనిట్
తెరపైకొస్తోంది. లవ్ స్టోరీ, నారప్ప, ఆచార్య.. ఇలా సినిమా యూనిట్స్ అన్నీ ఇప్పటికే ప్రకటించేశాయి.
తాజాగా ఖిలాడీ యూనిట్ కూడా తమ సినిమా మే నెలలో రావడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు
ఎఫ్3 సినిమా వంతు.

నిజానికి ఈ సినిమా రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది. ఆగస్ట్ నెలాఖరుకు రిలీజ్ అనుకున్నారు. కానీ అనీల్
రావిపూడికి కరోనా సోకడం, ఆ వెంటనే ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో ఎఫ్3 షూటింగ్ కూడా
నిలిచిపోయింది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన ఆగస్ట్ 27 తేదీకి ఎఫ్3 సినిమా రాదని స్వయంగా అనీల్
రావిపూడి ప్రకటించాడు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఈ దర్శకుడు ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ
సందర్భంగా ఎఫ్3 రిలీజ్ వాయిదా పడిందనే విషయాన్ని బయటపెట్టాడు. సినిమాకు సంబంధించి
50శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని, మిగతా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తనకు కూడా
క్లారిటీ లేదంటున్నాడు ఈ దర్శకుడు.