పుష్ప నుంచి బ్రేకింగ్ న్యూస్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది పుష్ప సినిమా. ఈ మూవీ నుంచి పెద్ద బ్రేకింగ్
న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. కుదిరితే ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని
అనుకుంటున్నారట. మొదటి భాగాన్ని ఈ ఏడాదిలో, వచ్చే ఏడాది రెండో భాగాన్ని రిలీజ్ చేయాలనే
ఆలోచనలో ఉన్నారట. నిజంగా ఇది చాలా పెద్ద విషయం.

ప్రస్తుతం పార్ట్ 1 కి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేశారు సుక్కు అండ్ టీం. కరోనా ప్రభావం తగ్గిన
వెంటనే శరవేగంగా షెడ్యుల్స్ ఫినిష్ చేస్తారు. అలా ఇంకో 2-3 షెడ్యుల్స్ లో సినిమా టోటల్ గా పూర్తి
కానుందని తెలుస్తోంది.

అక్టోబర్ లేదా నవంబర్ లో పుష్ప మొదటి భాగాన్ని విడుదల చేసి రెండో భాగాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్
చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న
ఈ ఫ్రాంచైజీ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

నిజానికి స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే సినిమా 2 భాగాలుగా అనుకున్నారట. సుకుమార్ ఈ విషయం చెప్పిన
వెంటనే బన్నీ చాలా ఎగ్జయిటింగ్ గా ఫీల్ అయ్యాడట. సో.. ఈ ఏడాది పుష్ప నుంచి మనం సగం సినిమానే చూస్తామన్నమాట. మిగతా సగం చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.