బాలయ్య సరసన శృతిహాసన్

బాలయ్య, శృతిహాసన్ కాంబినేషన్ బాగుంటుందా? బాలయ్య ఈ కోణంలో ఆలోచించడు. హీరోయిన్ ఎంత
లేతగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోయినా తన నటన తను చేసుకుంటూ పోతారు.
ఎటొచ్చి శృతిహాసన్ ఒప్పుకుంటుందా అనేది ప్రశ్న. ఇప్పుడీ చర్చ అంతా ఎందుకంటే, బాలయ్య
సినిమాలో హీరోయిన్ రోల్ కోసం శృతిహాసన్ ను సంప్రదించారు మరి.

గోపీచంద్ మలినేనికి శృతిహాసన్ ఓ సెంటిమెంట్. కెరీర్ స్టార్టింగ్ లో తీసిన ఓ సినిమాకు, తాజాగా తీసిన
క్రాక్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఆ రెండూ హిట్టయ్యాయి. దీంతో బాలకృష్ణ హీరోగా
త్వరలో చేయబోయే సినిమా కోసం కూడా శృతిహాసన్ ను తీసుకోవాలనేది మలినేని ఆలోచన. అలా
ఆయన సెంటిమెంట్ ను కొనసాగించాలని చూస్తున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ బాలయ్య సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకుంటుందా అనేది చూడాలి.
ఎందుకంటే, ఇప్పటికే ఆమె కుర్ర హీరోలకు దూరమైపోయింది. ఇలాంటి టైమ్ లో బాలయ్యతో కూడా
సినిమా చేసిందంటే ఇక ఆమె యంగ్ హీరోస్ కు దూరమైపోయినట్టే.