బాలీవుడ్ పై నాని రియాక్షన్

అవకాశం వస్తే బాలీవుడ్ ఆఫర్ ఎవ్వరూ వదులుకోరు. రామ్ చరణ్ నుంచి సుధీర్ బాబు వరకు అంతా
బాలీవుడ్ లో ఓ ప్రయత్నం చేసిన వాళ్లే. ఇలాంటి కోరిక నానికి కూడా ఉంది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన
ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై తన మనసులో మాట బయటపెట్టాడు నాని.

ఓ మంచి మేకర్ లేదా మంచి స్టోరీ దొరికితే బాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం
లేదన్నాడు నాని. తనకు భాషపై అంతగా పట్టులేనప్పటికీ, మంచి క్యారెక్టర్ దొరికితే హిందీ లాంగ్వేజ్
నేర్చుకొని మరీ నటిస్తానని క్లారిటీ ఇచ్చాడు.

మామూలుగా హిందీలో మాట్లాడ్డం నానికి వచ్చు. కానీ సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పేంత స్థాయిలో
హిందీ రాదు. కాబట్టి తప్పనిసరిగా తను హిందీ నేర్చుకోవాలనేంత మంచి పాత్ర తనకు దొరికితే కచ్చితంగా
చేస్తానంటున్నాడు.

ప్రస్తుతం తెలుగులో టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు నాని.
వీటిలో టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ 70శాతం పూర్తయింది. అంటే
సుందరానికి సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది.