టైగర్ కాంబినేషన్ రిపీట్స్

హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అప్పుడెప్పుడో టైగర్ అనే సినిమా
వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో, ఈ దర్శకుడు కలిశారు. ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ
సందర్భంగా సందీప్-ఆనంద్ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

తను నటించే ప్రతి సినిమాలోనూ ఓ కొత్తదనాన్ని చూపిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్
చేస్తుంటాడు సందీప్‌ కిషన్‌. త‌న చిత్రాల జానర్స్‌ ఎంపికలోనూ వైవిధ్యత ప్రదర్శించడం సందీప్‌ కిషన్‌
ప్రత్యేకత. ఈ అంశాలను ఫాలో అవుతూనే సందీప్‌ కిషన్‌ ఈ ఆసక్తికర సినిమాను ఓకే చేశారు.

కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్‌ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది. అంతే కాకుండా
సందీప్‌ కిషన్ కెరీర్‌లో ఇది 28వ చిత్రం కావడం విశేషం. ఇదొక సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీ. కాన్సెప్ట్‌
వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్‌ కిషన్‌కు టైగ‌ర్‌ ఒక కొత్త త‌ర‌హా చిత్రం.
హీరోయిన్ తో పాటు మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు.