గోవా బ్యూటీ సైడ్ బిజినెస్

ఇలియానాకు ప్రస్తుతం సినిమాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ పై మోజుతో తెలుగు ఆఫర్లు పక్కన
పెట్టేసింది. ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్లు తగ్గిపోయాయి. టాలీవుడ్ కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో సంపాదన
కోసం కొత్త దారులు వెదుకుతోంది ఇలియానా. ఇందులో భాగంగా బేకరీలు పెట్టే ఆలోచనలో ఉంది.

రీసెంట్ గా తన ఇనస్టాగ్రామ్ లో చాక్లెట్ కేక్ వీడియో పోస్ట్ చేసింది ఇలియానా. బహుశా ఇది నాకు
ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందేమో అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఆమె దేశవ్యాప్తంగా తన పేరిట
బేకరీలు పెట్టే ఆలోచనతో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.

నిజానికి ఇలియానాకు బిజినెస్ కొత్త కాదు. ఆమెకు ఇప్పటికే గార్మెంట్స్ బిజినెస్ ఉంది. డిజైనరీ గార్మెంట్స్
షాపులు ఆమెకున్నాయి. ఇలియానా తల్లి ఆ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా బేకరీ
బిజినెస్ పై మనసు పారేసుకున్నట్టుంది ఈ గోవాబ్యూటీ.