పాన్ ఇండియా మూవీ దసరా టార్గెట్

ఇప్పటికే ఓసారి వాయిదా పడింది కేజీఎఫ్2 సినిమా. ఆ తర్వాత జులై 16 అంటూ డేట్ ఇచ్చారు. ఇప్పుడు
ఆ తేదీ నుంచి కూడా సినిమా వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమాను దసరా
కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జులై టైమ్ కు కరోనా పరిస్థితి తగ్గినా థియేటర్లు తెరుస్తారనే గ్యారెంటీ లేదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా
వంద శాతం ఆక్యుపెన్సీ ఇస్తారనే గ్యారెంటీ అస్సలే లేదు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ. కాబట్టి ఇవన్నీ
దృష్టిలో పెట్టుకొని జులై నుంచి అక్టోబర్ కు సినిమా వాయిదా వేశారు.

మరోవైపు అక్టోబర్ లో రావాల్సిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆల్రెడీ వాయిదా పడింది. దీంతో ఆ వారంలో
కేజీఎఫ్2 ను తీసుకొస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగులో ఈ సినిమాకు
అడ్డంగా ఉన్న మూవీ పుష్ప ఒక్కటే. అది తప్పుకుంటే కేజీఎఫ్2 ఆల్ మోస్ట్ అక్టోబర్ ఫిక్స్.