బన్నీ సెంటిమెంట్ నడుస్తుందా?

కొన్ని సినిమాలకు వర్కౌట్ అయిన హీరోయిన్స్ ని మళ్ళీ తమ నెక్స్ట్ సినిమాల్లో పెట్టుకుంటూ
సెంటిమెంట్ గా భావిస్తుంటారు దర్శక నిర్మాతలు. తాజాగా సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో
తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉందట. సుకుమార్, మైత్రి కాంబినేషన్
లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో చరణ్ తో కలిసి డాన్స్ వేసిన సంగతి
తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ లో కూడా పూజాతో స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారు.

సుకుమార్-దేవి కాంబినేషన్ లో ఇప్పటికే చాలా ఐటెం సాంగ్స్ వచ్చాయి. అన్ని సూపర్ హిట్
సాధించాయి. ఇప్పుడు పుష్ప లో కూడా అలాంటి ఓ ఎనర్జిటిక్ ఐటెం సాంగ్ కంపోజ్ చేసి రికార్డింగ్ చేశాడు
దేవి శ్రీ ప్రసాద్. ఆ సాంగ్ కోసం మొన్నటి వరకూ దిశా పటాని తో పాటు మరికొందరు హీరోయిన్స్ ని
అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా తమకి కలిసొచ్చిన పూజతోనే సాంగ్ చేయించాలని డిసైడ్
అయ్యాడట సుకుమార్.

అటు బన్నీకి కూడా పూజా హెగ్డే ఓకే. ఎందుకంటే, బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అల
వైకుంఠపురములో సినిమాలో పూజానే హీరోయిన్. కాబట్టి పుష్పలో ఐటెంసాంగ్ కోసం పూజాను తీసుకుంటే
బన్నీకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. మొన్నటివరకు ఈ సాంగ్ కోసం దిశా పటానీని అనుకున్నారు.
ఇప్పుడు పూజా హెగ్డే పేరు తెరపైకొచ్చింది.