ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ప్రత్యేక విజ్ఞప్తి

తన ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ ఏడాది తన పుట్టినరోజును సెలబ్రేట్
చేయొద్దని, సంబరాల పేరిట బయటకొచ్చి గుమిగూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంతా ఇంట్లోనే
ఉండాలని, వైరస్ కు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడు.

రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఎన్టీఆర్. దానికోసం అతడి ఫ్యాన్స్ చాలా ప్లాన్ చేశారు. అన్నదానం,
రక్తదానం లాంటివి చాలా అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ అమల్లో ఉన్న కారణంగా, తన
పేరిట ఎలాంటి కార్యక్రమాలు జరపొద్దని, ఎవ్వరూ బయటకు రావొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఇక పుట్టినరోజు సందర్భంగా రేపు ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ పోస్టర్ ఒకటి రిలీజ్
అవ్వబోతోంది. పోస్టర్ రెడీగా ఉందని, రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని ఆల్రెడీ యూనిట్
నుంచి ప్రకటన కూడా వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కొత్త సినిమా ప్రకటన ఉంటుందా ఉండదా
అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.