ఎట్టకేలకు తెరపైకి అనిరుధ్

ఎన్టీఆర్-కొరటాల సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను
తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చేనెల అధికారిక ప్రకటన రాబోతోంది. నిజానికి అరవింద సమేత
టైమ్ లోనే అనిరుధ్ ను తీసుకోవాలనుకున్నాడు ఎన్టీఆర్. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్లకు
ఈ కాంబినేషన్ వర్కవుట్ అయింది.

అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. అందులో పాటలు హిట్టయినా, సినిమా
ఫ్లాప్ అవ్వడంతో అనిరుధ్ కు పేరు రాలేదు. పైపెచ్చు నెగెటివ్ సెంటిమెంట్ కూడా వచ్చేసింది.
అరవింద సమేతకు సంగీతం అందించే ఛాన్స్ మిస్సయింది ఇందుకే. అలా టాలీవుడ్ కు దూరమైన
అనిరుధ్.. మధ్యలో జెర్సీ చేసినప్పటికీ తెలుగులో క్లిక్ అవ్వలేకపోయాడు.

ఇన్నాళ్లకు ఎన్టీఆర్-కొరటాల సినిమాకు అనిరుధ్ ను తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే కనుక
నిజమైతే అనిరుధ్ కు టాలీవుడ్ లో ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం కోలీవుడ్ లో ఫుల్
స్వింగ్ మీదున్న ఈ దర్శకుడు.. తారక్ సినిమాతో టాలీవుడ్ లో కూడా చక్రం తిప్పడం ఖాయం.