దసరా సీజన్ పై కన్నేసిన బడా హీరోలు

కరోనాతో టాలీవుడ్ కుదేలైంది. సినిమా రిలీజులన్నీ చెల్లాచెదురయ్యాయి. కాస్త కుదుటపడిందనుకున్న టైమ్ కు సెకెండ్ వేవ్ వచ్చి మొత్తం దెబ్బ కొట్టింది. దీంతో రిలీజ్ కావాల్సిన చాలా పెద్ద సినిమాలు వాయిదాల బాటపట్టాయి. అలా వాయిదా పడిన 2 సినిమాలు ఇప్పుడు భారీగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి.

చిరంజీవి నటించిన ఆచార్య, ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాల్ని దసరా బరిలో నిలపాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి. మినిమం గ్యాప్ లో ఈ రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాలకు ముందుగా లైన్ క్లియర్ చేయాలనుకుంటున్నాడు.

అంతకంటే ముందు టక్ జగదీశ్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విరాటపర్వం లాంటి సినిమాల్ని వారానికొకటి చొప్పున విడుదల చేసేలా చర్చలు సాగుతున్నాయి.

అయితే చర్చలైతే బాగున్నాయి కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది అందర్లో అనుమానం. ఎందుకంటే, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రభుత్వం థియేటర్లకు అనుమతులు ఇచ్చేలా లేదు. ఇచ్చినా 50శాతం ఆక్యుపెన్సీ తప్పనిసరిగా అమలు చేసేలా ఉంది. ఇలా అయితే పెద్ద సినిమాలకు కష్టమే.