మెగాస్టార్ నుంచి మరో పెద్ద కార్యక్రమం

కరోనా సహాయక చర్యల్లో ఇప్పటికే చాలా బిజీగా ఉన్నారు చిరంజీవి. గతేడాది కరోనా టైమ్ లో సీసీసీ ద్వారా సేవలు అందించారు. సినీకార్మికులకు నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. సెకెండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏకంగా జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటుచేశారు.

ఇప్పుడు తన సహాయ కార్యక్రమాల్ని మరింత కొనసాగిస్తూ.. వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు చిరంజీవి. త్వరలోనే ఓ పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు చిరంజీవి. ఇండస్ట్రీకి చెందిన హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు.. 24 విభాగాలకు చెందిన వ్యక్తులు, సినీ కార్మికులందరికీ టీకాల్ని ఉచితంగా వేయించే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు చిరంజీవి.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు చిరు. తనయుడు రామ్ చరణ్, అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నారు.