చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తా!

మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో చిరంజీవి అంటున్న ఈ దర్శకుడు.. ఎప్పటికైనా చిరంజీవితో మరో సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు.

“అప్పటికంటే ఇప్పుడు చిరంజీవి స్థాయి పెరిగింది. ఆయనతో ఓ మంచి సందేశాత్మక సినిమా తీయొచ్చు. ఎప్పటికైనా చిరంజీవి గారితో మరో సినిమా చేస్తాను. సినిమాలు చేయడానికి ఆయనెప్పుడూ సిద్ధంగా, ఫిట్ గా ఉంటారు. ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో అతడే.”

ఇలా చిరంజీవిపై తనకున్న ప్రేమన బయటపెట్టాడు గుణశేఖర్. గతంలో చిరంజీవి హీరోగా చూడాలని ఉంది అనే సూపర్ హిట్ సినిమా తీశాడు గుణశేఖర్. ఆ తర్వాత అదే చేత్తో మృగరాజు అనే డిజాస్టర్ కూడా తీశాడు. ఆ రెండు సినిమాలకు తనే బాధ్యత తీసుకుంటానంటున్న గుణశేఖర్.. ఈసారి చిరంజీవితో సినిమా చేస్తే, ఓ భారీ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకుంటానని చెబుతున్నాడు.