సోలో బ్రతుకే బెటర్ అంటున్న హీరోయిన్

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటారు కొంతమంది హీరోయిన్లు. ప్రస్తుతం తను ఎవ్వరితో డేటింగ్ చేయడం లేదని క్లారిటీ ఇస్తుంటారు మరికొందరు హీరోయిన్లు. కానీ మాళవిక శర్మ మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అంటోంది. సింగిల్ గా ఉండడంలో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదని చెబుతోంది.

ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ప్రేమలో పడలేదు. కనీసం ఎవ్వరితో డేటింగ్ చేసినట్టు కూడా లేదు. దీనికి కారణం తన తల్లిదండ్రులు ఇచ్చిన సలహానే అంటోంది మాళవిక. ఎవ్వరిపై ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవించాలని తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారని, అందుకే తను ఇప్పటివరకు డేటింగ్ చేయలేదని అంటోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లాయర్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెకు అడ్వకేట్ గా లైసెన్స్ కూడా లభించింది. అయితే తను లాయర్ అయినప్పటికీ, సినిమాలు మాత్రం ఆపనంటోంది మాళవిక.