చిరంజీవి ఆధ్వర్యంలో టీకాల కార్యక్రమం

మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా
కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్
నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఈరోజు ఉదయం చిరంజీవి
చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్
24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ కూడా
ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ సిసిసి
తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పునః ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు,
అపోలో 24/7ల సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం అయింది.”

పునః ప్రారంభం అని ఎందుకన్నారంటే…. నిజానికి ఇది మూడు వారల క్రితమే మొదలైంది. అయితే
వాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఇకపై ఈ వాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎంతమంది
వస్తే.. అందరికి వాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది తమ పేర్లు నమోదు
చేసుకున్నారు. కనీసం రోజుకు ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.