చేతులు మారిన రవితేజ సినిమా

మొన్నటివరకు రవితేజ లిస్ట్ లో ఉండేది ఆ సినిమా. ఉన్నట్టుంది సడెన్ గా మెగా కాంపౌండ్ లోకి షిఫ్ట్
అయింది. అవును.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ రాజా చేయాల్సిన సినిమా.. ఇప్పుడు వరుణ్
తేజ్ చేతికి చేరింది. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.

కేవలం రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశాడు రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. ఇప్పుడు వరుణ్
తేజ్ కోసం మార్పుచేర్పులు చేయబోతున్నాడు. అయితే హీరో మారినా, ప్రొడ్యూసర్లు మాత్రం మారలేదు.
పీపుల్ మీడియా బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.

ఈ సంగతి పక్కనపెడితే.. రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా
మారింది. ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పిన తర్వాత రవితేజ దాన్నుంచి తప్పుకున్నాడంటే, దానికి కేవలం
రెమ్యూనరేషన్ మాత్రమే కారణం అనేది చాలామందికి తెలిసిన విషయం. ఈ మూవీకి కూడా పారితోషికం
విషయంలో తేడాలొచ్చి రవితేజ తప్పుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.