విశ్వక్ సేన్ కొత్త సినిమా డీటెయిల్స్

విశ్వక్ సేన్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే, లాక్ డౌన్ తో సంబంధం
లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ఈ హీరో. ఇదే ఊపులో మరో సినిమాకు పచ్చజెండా
ఊపాడు విశ్వక్. త్వరలోనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు.

విశ్వక్ కోసం ఓ డిఫరెంట్ స్టోరీ రాశాడు కథా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. దర్శకుడు సూర్య ప్రతాప్
తో కలిసి వెళ్లి నెరేషన్ కూడా ఇచ్చాడు. ఆ స్టోరీలైన్ కు విశ్వక్ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు ప్రసన్న
కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించబోతున్నాడు.

ప్రస్తుతం విశ్వక్ చేతిలో పాగల్ సినిమా ఉంది. థియేటర్లు తెరిచిన వెంటనేఈ సినిమాను రిలీజ్ చేస్తారు. ఓ
మై కడవులే రీమేక్ సెట్స్ పై ఉంది. అది పూర్తయిన తర్వాత సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై
విశ్వక్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.