తారక్ నుంచి బన్నీకి సినిషిఫ్ట్ అయిన బుచ్చిబాబు

మొన్నటివరకు బుచ్చిబాబు పేరు ఎన్టీఆర్ కాంపౌండ్ లో వినిపించింది. ఇప్పుడీ దర్శకుడి పేరు మరోసారి
మెగా కాంపౌండ్ లో వినిపిస్తోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అల్లు అర్జున్ హీరోగా బుచ్చిబాబు
సినిమా ఉండొచ్చనేది టాక్.

ఎన్టీఆర్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా రెడీ చేశాడు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కు కూడా కథ నచ్చింది. కానీ
ఉన్నఫలంగా చేయలేని పరిస్థితి. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా
ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాప్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు బుచ్చిబాబు.

ఇందులో భాగంగా అల్లు అర్జున్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడట ఈ దర్శకుడు. బన్నీకి కూడా కథ బాగా
నచ్చిందంట. కొన్ని మార్పుచేర్పులు చెప్పాడట. సినిమా ఓకే అవుతుందా అవ్వదా అనేది ప్రస్తుతానికి
సస్పెన్స్. ఏ హీరోతో సినిమా ఓకే అయినా, బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే
ఉంటుంది.