రవితేజ మూవీ రీమేక్ కాదంటున్న దర్శకుడు

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఓ వైపు ఈ సినిమా
షూటింగ్ నడుస్తున్నప్పటికీ, మరోవైపు ఈ మూవీపై పుకార్లు కూడా నడుస్తున్నాయి. ఓ తమిళ సినిమా
ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై దర్శకుడు
స్పందించాడు.

ఖిలాడీ సినిమా రీమేక్ కాదంటున్నాడు రమేష్ వర్మ. అయితే ఓ తమిళ సినిమాకు, ఖిలాడీకి కనెక్షన్
ఉన్నమాట నిజమేనని అంగీకరించాడు. ఓ హిట్ తమిళ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్, తన ఖిలాడీ
సినిమాలో ఇంటర్వెన్ సీన్ ఒకేలా ఉంటాయని అంగీకరించాడు.

అంతమాత్రంచేత ఖిలాడీ సినిమా రీమేక్ కాదంటున్నాడు రమేష్ వర్మ. ఆ ఇంటర్వెల్ సీన్ కు
సంబంధించి కూడా సదరు తమిళ సినిమా నిర్మాతతో మాట్లాడానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తమిళ
సినిమా పేరేంటనే విషయాన్ని మాత్రం ఈ దర్శకుడు బయటపెట్టలేదు.