పవన్-అనీల్ రావిపూడిని కలిపే ప్రయత్నం

నిర్మాత దిల్ రాజు అలా అమెరికా నుంచి తిరిగొచ్చాడో లేదో ఇలా అతడిపై పుకార్లు మొదలయ్యాయి.
ఈసారి ఆ పుకార్లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అదేంటంటే.. పవన్ కల్యాణ్, అనీల్ రావిపూడి
కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో దిల్ రాజు బిజీగా ఉన్నాడట.

దిల్ రాజుకు మరో సినిమా చేసి పెడతానని హామీ ఇచ్చాడు పవన్. ఈ మేరకు అడ్వాన్స్ కూడా
అందుకున్నాడు. అయితే దర్శకుడు మాత్రం సెట్ అవ్వడం లేదు. ఈ క్రమంలో మహేష్ బాబు కోసం
అనీల్ రావిపూడి ఓ కథ చెప్పడం, మహేష్ మాత్రం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయి.

అలా మహేష్ బాబు కోసం అనుకున్న కథతో పవన్ కల్యాణ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ
సినిమా చేయాలని భావిస్తున్నాడట దిల్ రాజు. ఈ నెలలోనే పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి మధ్య
మీటింగ్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాడట. ఈ ప్రాజెక్టు కనుక ఓకే అయితే.. అనీల్ రావిపూడి జాక్ పాట్
కొట్టినట్టే.