వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన యూనిట్

ఫ్యామిలీ మేన్ సీజన్-2 స్ట్రీమింగ్ కు ముందు ఒక వివాదం నడిస్తే, స్ట్రీమింగ్ కొచ్చిన తర్వాత మరో వివాదం
మొదలైంది. ఈ సినిమాలో సమంతను కావాలనే నల్లగా చూపించారంటూ ఆమె వీరాభిమానులు సోషల్
మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. అందంగా ఉండే తమ అభిమాన హీరోయిన్ ను, ప్రయోగాల పేరిట
కావాలనే అందవిహీనంగా చూపించారని, సమంత ఇమేజ్ ను దెబ్బతీసేందుకే మేకర్స్ ఇలా చేశారంటూ
సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.

ఈ వివాదంపై ఫ్యామిలీ మేన్ దర్శక ద్వయం రాజ్ నిడమోరు, డీకే స్పందించారు. ఫ్యామిలీ మేన్
సీజన్-2లో రాజి అనే పాత్ర పోషించింది సమంత. తమిళ ఈలంకు చెందిన మహిళ పాత్ర అది.
అణచివేతకు గురైన అలాంటి మహిళ పాత్రను డీ-గ్లామరైజ్డ్ గానే చూపించాలని, అందంగా మేకప్ వేసి
చూపించలేమని క్లారిటీ ఇచ్చారు.

నిజానికి ఫ్యామిలీ మేన్ లో సమంత పోషించిన రాజి పాత్రకు గ్లామర్ కు అస్సలు సంబంధం
లేదంటున్నారు దర్శకులు. కేవలం సమంత యాక్టింగ్, ఆమె కష్టాన్ని మాత్రమే చూడాలని.. అందంగా
ఉందా లేదా అనే విషయాన్ని అస్సలు పట్టించుకోవద్దని కోరుతున్నారు.