బన్నీ తదుపరి చిత్రంపై స్పష్టత

పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే విషయంపై చాలా చర్చ నడిచింది. బుచ్చిబాబు
దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని కొందరు, బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడని మరికొందరు,
ఆల్రెడీ ప్రకటించిన ఐకాన్ సినిమాను మొదలుపెడతాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు వీటిపై
క్లారిటీ వచ్చింది.

పుష్ప, పుష్ప-2 పూర్తయిన తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు
అల్లు అర్జున్. చాన్నాళ్లుగా ఆలస్యమౌతూ వస్తున్న ఈ సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని
నిర్ణయించాడు బన్నీ. ఈ మేరకు దిల్ రాజుకు సమాచారం అందించాడు.

పుష్ప సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తుంది. పుష్ప-2 పూర్తయ్యేసరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి
వస్తుంది. ఆ తర్వాత ఐకాన్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ బన్నీకి బాగా నచ్చింది. అందుకే
ఆలస్యమైనా తనే చేస్తానని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే తనే చేస్తున్నాడు.