అఖిల్ సినిమా ఇంకా పెండింగ్

అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీలోకి వస్తుందంటూ ఆమధ్య పుకార్లు వచ్చాయి. ఆ
వెంటనే గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఖండనలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ పై
వచ్చిన రూమర్లన్నీ ఆగిపోయాయి. అయితే రూమర్లు ఆగిపోయినా, నిర్మాతల ఆలోచనలు మాత్రం
ఆగిపోలేదు.

తమ సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలా లేక థియేటర్లలో రిలీజ్ చేయాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం
తీసుకోలేదని ప్రకటించాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిర్మాత బన్నీ వాస్. తమ సంస్థపై నిర్మించిన
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, 18 పేజెస్ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేదా ఓటీటీ
డైరక్ట్ రిలీజ్ చేయాలా? అని ఆలోచిస్తున్నామన్నాడు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో దానిపై ఓ నిర్ణయం
తీసుకుంటామని చెప్పాడు.

మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు. అంతా అనుకుంటున్నట్టు ఈ
సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదని, మరో 3 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని తెలిపాడు.