జీ గ్రూప్ చేతికి శ్రీవిష్ణు సినిమా

సినిమా హక్కులు దక్కించుకునే విషయంలో ఈమధ్య కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్న జీ గ్రూప్, అదే
ఊపులో మరో సినిమా దక్కించుకుంది. శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాకు సంబంధించి డిజిటల్,
శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది జీ. దీంతో పాటు థియేట్రికల్ రైట్స్ లో కూడా భాగం తీసుకుందంటూ
పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

వివేక్ ఆత్రేయ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హాసిత్ గోలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచమవుతున్నాడు.
శ్రీవిష్ణు సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవిబాబు ముఖ్య పాత్రలో
నటిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు
వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సినిమాకు సంబంధించి ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమా కథ ఏంటనే విషయంతో పాటు టీజర్
రిలీజ్ డేట్ ను ఆ వీడియోలో ప్రకటించారు. గంగవ్వ గొంతుతో ఫన్నీగా తయారుచేయించిన ఆ వీడియో
ప్రస్తుతం వైరల్ అవుతోంది.