”జాతిరత్నం”కు మరో అవకాశం

అదృష్టంకొద్దీ జాతిరత్నాల్లో నటించే అవకాశం అందుకుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. నాగ్ అశ్విన్ వద్ద వర్క్ చేసింది కాబట్టి ఛాన్స్ ఈజీగా వచ్చేసింది. కానీ భవిష్యత్తులో ఫరియాకు అవకాశాలు కష్టం అంటూ చాలా విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. ఆమె హైట్ కు ఛాన్స్ రావడం కష్టం అన్నారు.

దాన్ని నిజం చేస్తూ, రవితేజ సినిమా ఆఫర్ ఇలా వచ్చి అలా చేజారిపోయింది. రీసెంట్ గా కొత్త దర్శకుడితో రవితేజ ఎనౌన్స్ చేసిన ఓ సినిమాలో ఫరియా అబ్దుల్లాను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఆమె స్థానంలో దివ్యాంశ కౌషిక్ ను తీసుకున్నారు. అలా ఫరియా అబ్దుల్లాకు ఇప్పటివరకు సెకెండ్ ఛాన్స్ దక్కలేదు.

ఎట్టకేలకు ఈ బ్యూటీకి హీరోయిన్ గా సెకెండ్ ఛాన్స్ దక్కేలా ఉంది. ఈసారి మంచు విష్ణు ఆమెకు అవకాశం ఇవ్వబోతున్నాడట. శ్రీనువైట్ల దర్శకత్వంలో డీ అండ్ డీ అనే సినిమా ఎనౌన్స్ చేశాడు మంచు విష్ణు. సినిమాను ప్రకటించి చాన్నాళ్లయింది. ఇప్పుడీ సినిమాలో ఫరియా అబ్దుల్లాను హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ ఛాన్స్ అయినా ఫరియాకు దక్కుతుందో లేదో చూడాలి.