బన్నీ భార్యకు కూడా ఇంత ఫాలోయింగా..!

హీరోల భార్యలు పెద్దగా బయటకు రారు. వాళ్లకు ఫ్యాన్ గ్రూపులుండవు. స్టార్ స్టేటస్ రాదు. కానీ బన్నీ భార్య మాత్రం ఈ లెక్కలోకి రాదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. భర్తతో కలిసి దిగిన ఫొటోలతో పాటు పిల్లల పిక్స్ షేర్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక హంగామా చేస్తుంది. అదే ఆమెకిప్పుడు సరికొత్త గుర్తింపు
తీసుకొచ్చింది.

అల్లు అర్జున్ స‌తిమ‌ణి అల్లు స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్
సృష్టించారు, దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోవ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇన్
స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ ఓ స‌రికొత్త
రికార్డు సృష్టించారు.

ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,
త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ ముమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివిధ
రంగాల‌కు సంబంధించిన పోస్టులను అల్లు స్నేహా పెడుతుంటారు.