బుల్లితెరపై కూడా మెరిసిన పలాస

ప్రయోగాత్మకంగా వచ్చిన పలాస సినిమా వెండితెరపై సృష్టించిన సంచలనం గురించి అందరికీ
తెలిసిందే. ఓ చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ, బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకుంది. అత్యంత సహజంగా
తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడీ సినిమా అనూహ్యంగా బుల్లితెరపై
కూడా విజయం సాధించింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో పలాస సినిమాను ప్రసారం చేస్తే, అత్యథికంగా 5
టీఆర్పీ వచ్చింది. ఈ స్టార్ కాస్ట్ కు, ఈ సినిమాకు ఈ టీఆర్పీ ఎక్కువనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాకు
బుల్లితెరపై తిరస్కరణ ఎదురవుతుందని అంతా భావించారు. ఇందులో కంటెంట్, అందులో వయొలెన్స్
అలాంటిది. కానీ అనూహ్యంగా ఓ సెక్షన్ స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చిందనే
విషయం రేటింగ్ తో ప్రూవ్ అయింది.

పలాస సినిమాకు రఘు కుంచె సంగీతం అందించడంతో పాటు, ఇందులో ఓ కీలక పాత్ర కూడా
పోషించారు. రఘు కుంచె అందించిన ఓ పాటైతే ఇప్పటికీ యూట్యూబ్ లో సంచలనమే. నక్కిలీసు
గొలుసు అనే ఈ పాట ఒరిజినల్ వెర్షన్ తో పాటు.. ప్రమోషనల్ సాంగ్ వెర్షన్ కూడా సూపర్ హిట్టయింది.