హీరోయిన్లకు పూరి జగన్నాధ్ క్లాస్

పూరి మ్యూజింగ్స్ ఎంత విలక్షణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యూజింగ్స్ లో పూరి ఎంపిక
చేసుకునే టాపిక్స్, వాటిని అతడు వివరించే విధానం చాలా బాగుంటుంది. తాజాగా అలాంటిదే మరో కొత్త
టాపిక్ అందుకున్నాడు. అదేంటంటే.. హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోకూడదంట. సోలోగానే మిగిలిపోవాలంట.
దీనికి ఆయన తనదైన ఎనాలిసిస్ ఇచ్చాడు.

దేశానికి సింగిల్ ఉమెన్ ఇప్పుడు చాలా అవసరం అంటున్నాడు పూరి జగన్నాధ్. ఓ మహిళ ఒంటరిగా తన
కాళ్లపై తను నిలబడగలగాలని, మగాడిపై ఆధారపడకుండా జీవించాలని అంటున్నాడు పూరి. అది
సమాజానికి చాలా అవసరం అంటున్నాడు. ఇలా జరగాలంటే అది హీరోయిన్ల నుంచే మొదలవ్వాలనేది
పూరి వాదన.

హీరోయిన్లను అంతా ఆదర్శంగా తీసుకుంటారని, వాళ్లు కూడా మిగతా అమ్మాయిలతో పోలిస్తే స్ట్రాంగ్ గా
ఉంటారు కాబట్టి.. హీరోయిన్లు ఎవ్వరూ మగాళ్లపై ఆధారపడకూడదని, పెళ్లిళ్లు చేసుకోకూడదని, పిల్లల్ని
కనకూడదని డిమాండ్ చేస్తున్నాడు పూరి. అప్పుడే కొత్త సమాజం ఏర్పడుతుందని అంటున్నాడు.