మేజర్ మూవీ షూటింగ్ అప్ డేట్

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘మేజర్‌’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 90
శాతం పూర్తయింది. అడివి శేష్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్‌’ సినిమాకి శేష్‌
స్క్రిప్ట్‌ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. జులై నుంచి మరో
షెడ్యూల్ ప్లాన్ చేశారు.

“గత ఏడాది చిట్కుల్‌ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్‌’ చిత్రీకరణ
మొదలైంది. అక్కడ అంతగా చలిగా ఏం లేదు. కానీ ఆ ప్రాంతపు విజువల్స్, అక్కడివారితో ఉన్న జ్ఞాపకాలు మరువలేనివి. జూలైలో ‘మేజర్‌’ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా
ఎదురుచూస్తున్నాను. అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్‌’ చిత్రం
రూపొందుతుంది’’ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు అడివి శేష్.

అప్ డేట్ ఇచ్చిన సందర్భంగా నిర్మాత శరత్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు అడివి శేష్. సయీ
మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. ప్రకాష్ రాజ్, శోభితా
ధూలిపాళ్ల, రేవతి, మురళీశర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.