నగ్మా మొదటి సినిమాకు 30 ఏళ్లు

సీరియర్ హీరోయిన్ నగ్మా నటించిన తొలి సినిమా తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు.
ఆమె నటించిన తొలి సినిమా పెద్దింటల్లుడు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి
సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న నగ్మాకు ఈ విషయం గుర్తుందో లేదో కానీ, టాలీవుడ్ మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై టి ఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా నగ్మా పరిచయం అయింది. ఈ సినిమా సక్సెస్ తరువాత నగ్మా
తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది.

సుమన్ ఈ సినిమాలో హీరో. ప్రముఖ నటుడు మోహన్ బాబు, వాణిశ్రీ రెండు కీలక పాత్రలు పోషించారు.
వీళ్లిద్దరితో సుమన్ నటించడం అదే తొలిసారి. ఈ సినిమా కోసం తొలిసారి సుమన్ ముసలి గెటప్ వేశాడు.
ఆ తర్వాత మళ్లీ అలాంటి గెటప్ ఆయన వేయలేదు.

తమిళ్ లో సూపర్ హిట్టయిన నడిగర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది పెద్దింటల్లుడు. శరత్ ఈ సినిమాకు
దర్శకుడు.